రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్రాన్ని కోరారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ రియల్టీ సంస్థ నూతన వెంచర్‌లో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ… ‘‘రతన్ టాటా కేవలం గొప్ప పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా, అరుదైన మానవతావాది. విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు అపారమైనవి. దేశానికి ఆయన అందించిన సేవలను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. నాలుగేళ్ల క్రితమే ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసి రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని సూచించాను’’ అని తెలిపారు.
‘‘భారతరత్న ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రతి భారతీయుడి గుండెల్లో రతన్ టాటా ఒక రత్నం. సాధారణంగా రియలెస్టేట్ వెంచర్లలో దేవుళ్ల విగ్రహాలను స్థాపిస్తారు. కానీ ఇక్కడ రతన్ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం’’ అని రఘురామ పేర్కొన్నారు.
Read More : టీటీడీ EO బంగ్లాలోకి నాగుపాము

One thought on “భారతరత్నకు అర్హుడు రతన్ టాటా — ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ”
Comments are closed.