రజనీకాంత్, ఎన్టీఆర్, హృతిక్ – సినిమాల పోటీపై శివరాజ్‌కుమార్ స్పందన

Shiva Rajkumar comments on Coolie vs War 2 clash

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న “కూలీ” మరియు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న “వార్ 2” ఒకే రోజున, 2025 ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ భారీ బాక్సాఫీస్ పోటీపై ఇటీవల శివరాజ్‌కుమార్ స్పందించారు. “మనస్పూర్తిగా అన్నీ సినిమాలు బాగా సక్సెస్ అవ్వాలని మనసులో కోరుకుంటున్నాను, ఎందుకంటే మనం అన్నదమ్ముల్లాగా ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం” అని ఆయన చెప్పారు.

శివరాజ్‌కుమార్, ఉపేంద్ర రావుతో కలిసి తన రాబోయే చిత్రం “45” ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, “45” కూడా ఆగస్టు 15న విడుదల కానుంది, అంటే అదే వీకెండ్‌లో ప్రేక్షకులను పలకరించనుంది.

“కూలీ” సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున అక్కినేని, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శృతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ వంటి స్టార్స్ కూడా ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు సిద్ధమయ్యారు. ఆమీర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం.5

మరోవైపు, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “వార్ 2″ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇది 2019లో విడుదలైన “వార్” చిత్రానికి సీక్వెల్‌గా రానుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్ విలన్‌గా అలరించనున్నాడు.

Read More




One thought on “రజనీకాంత్, ఎన్టీఆర్, హృతిక్ – సినిమాల పోటీపై శివరాజ్‌కుమార్ స్పందన

Comments are closed.