గ్లామర్ అండ్ ఎలిగెన్స్: దిశా పటానీ న్యూ లుక్ వైరల్

Disha Patani traditional and bold look

టోన్డ్ బాడీకి తగ్గట్లుగా దిశా పటానీ ధరించిన డిజైనర్ చీర అందరినీ ఆకట్టుకుంటోంది. సీకే బ్యూటీగా తన అందాలను మెరిపిస్తూ, ట్రెడిషనల్ స్టైల్‌లోనూ గ్లామర్ ను సమపాళ్లలో చూపించగలిగిన ప్రత్యేకతను మరోసారి నిరూపించింది. ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో మెరిసే చీరలో దిశా మైమరిపిస్తోంది.

ఒకే లుక్కులో రెండు విభిన్న శైలులు ప్రదర్శించడం ఎలానో దిశా స్పష్టంగా చూపించింది. ఒకవైపు సంప్రదాయ సౌందర్యాన్ని, మరోవైపు గ్లామర్ లుక్‌ను సమపాళ్లలో నిలిపి, తన విలక్షణతను మరోసారి చూపించింది. ట్రెడిషనల్ అవతార్‌లోను దిశా తన మత్తు చూపిస్తూ ఆకట్టుకుంది.

ఇటీవల దిశా పటానీ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్ తర్వాత ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. స్టైలిస్ట్ మోహిత్ రాయ్ పుట్టినరోజు వేడుకలో కూడా ఈ జంట కలిసి దర్శనం ఇచ్చింది.

కెరీర్ విషయానికి వస్తే, దిశా పటానీ చివరిసారిగా ‘కంగువా’ చిత్రంలో కనిపించింది. ఈ తమిళ సినిమాలో తొలిసారి నటించినా, తొలి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దిశా బిజీగా మారనుంది.

Read More


One thought on “గ్లామర్ అండ్ ఎలిగెన్స్: దిశా పటానీ న్యూ లుక్ వైరల్

Comments are closed.