వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, తనపై జారీ చేసిన ఏపీ సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. మద్యం స్కాం కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన ఏపీ సిట్, మిథున్ రెడ్డిని శుక్రవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
విచారణ సమయంలో తన న్యాయవాది సమక్షంలో పాల్గొనాలని, అలాగే వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టవచ్చు.
ఇప్పటికే, ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటం వలన, ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత, ఎంపీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణకు సహకరించాలని ఆయనకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, మిథున్ రెడ్డికి ఏపీ సిట్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేయడంతో, కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
Read More : తిరుపతి గోశాల వివాదం : గుంపులుగా రాకూడదని వైసీపీ నేతలకు పోలీసుల హెచ్చరిక
