ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ బాధ్యతలతో ఎన్నడూ తీరిక లేకుండా ఉండే ఆయన, ఈసారి కొంత రిలాక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు నుంచి చంద్రబాబు యూరప్ పర్యటనకు బయల్దేరనున్నారు.
యూరప్ పర్యటనకు వెళ్లేముందు ఆయన రాజకీయ, పరిపాలన సంబంధిత కీలక సమావేశాలతో బిజీగా గడిపారు. కాసేపట్లో ఆయన 16వ కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో భేటీ అవ్వనున్నారు. ఈ భేటీ అనంతరం విజయవాడలో ఆర్థిక సంఘం ప్రతినిధులకు ప్రత్యేక విందును ఆయన ఆతిథ్యమివ్వనున్నారు.
రాత్రి విందు ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీకి రవాణం కానున్నారు. ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.
ఈ నెల 20న చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు విదేశాల్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆయన నిర్ణయించారు. పర్యటన ముగిసిన అనంతరం ఈ నెల 22న చంద్రబాబు ఢిల్లీకి తిరిగి చేరుకోనున్నారు. 23వ తేదీన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశమున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Read More : ఏపీ రాజ్యసభ ఖాళీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల — మే 9న ఓటింగ్

One thought on “ఏపీ సీఎం చంద్రబాబు యూరప్ పర్యటనకు సిద్ధం”
Comments are closed.