యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు ఒక విభిన్న ప్రయత్నానికి సై అన్నారు. ఇప్పటికే నాగకన్యలు, నాగమణి, నాగిన్ వంటి పాఠాల మీద సినిమాలు, సీరియల్స్ చాలానే వచ్చినా, ఇప్పుడు నాగుపాముల నేపథ్యంతో కూడిన ఓ కామెడీ ఫిల్మ్‌ని చేయబోతున్నారు. ఈ సినిమాలో కార్తీక్ నాగరాజుగా మారి హాస్యంతో అలరించనున్నాడు. చిత్రానికి ‘నాగ్జిల్లా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోయేది మృగ్‌దీప్ సింగ్ లాంబా. సర్పాలపై ఆధారపడిన ఈ కథను హాస్య ప్రధానంగా మలిచినట్టు సమాచారం. హాలీవుడ్ గాడ్జిల్లా తరహాలో “నాగ్జిల్లా” అనే టైటిల్‌ను ఎంపిక చేయడమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు ఇష్టపడేలా సరైన టచ్ ఇవ్వాలనుకుంటున్నారు.
ఇప్పటికే ఫోటోషూట్ పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 2025లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా, 2026 రెండో భాగంలో విడుదల చేయాలనే యోచనలో మేకర్స్ ఉన్నారు. టైటిల్ ఖరారయ్యేలోగా “ఇచ్చాధారి నాగిన్”, “నాగ్జిల్లా” లాంటి పేర్లను కూడా పరిశీలించినట్లు సమాచారం.
ఇకపోతే కార్తీక్ ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుండగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాదు, సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో “తు మేరీ మై తేరా” అనే మరో రొమాంటిక్ కామెడీ ప్రాజెక్ట్‌లో కూడా నటించనున్నాడు.

One thought on “నాగుపాముల ప్రపంచంలోకి కార్తీక్ ఆర్యన్!”
Comments are closed.