హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న హెచ్‌సియు కంచ భూముల అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుండి రూ.10,000 కోట్ల రుణాన్ని తెచ్చిన విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గచ్చిబౌలిలోని హెచ్‌సియు కంచ ప్రాంతంలోని భూములు ప్రభుత్వానికి చెందినవే. వాటిని ఎకరా రూ.75 కోట్ల చొప్పున టీఎస్ఐఐసీకి అప్పగించాం. ఈ భూములను టీఎస్ఐఐసీ సుమారు 400 ఎకరాలు తాకట్టు పెట్టి, ఐసీఐసీఐ బ్యాంక్ నుండి రూ.10 వేల కోట్లు రుణంగా తీసుకుంది,” అని వివరించారు.
ఇంతటి కీలక విషయాన్ని ఓపెన్‌గా వెల్లడించిన మహేష్ గౌడ్, గతంలో ఇచ్చిన జీవోలో ఎకరాకు రూ.75 కోట్లు అని తప్పుగా ప్రస్తావించబడిందన్న ఆరోపణలపై స్పందించారు. “జీవోలో టైపింగ్ లోపం వల్ల ఇలా పడ్డట్లుగా ఇప్పుడు స్పష్టత వచ్చింది,” అని అన్నారు.
రియల్ ఎస్టేట్ హ్యాండిల్ పేరిట కొన్ని వర్గాలు చేస్తున్న ఆరోపణలు సరైనవిగా ఉండవని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు వదలాలని ఆయన హితవు పలికారు. “తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించడం కన్నా నిజాన్ని అంగీకరించడం గొప్ప విషయం,” అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Read More : బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై హైకోర్టు కీలక ఆదేశాలు..

One thought on “హెచ్‌సియు గచ్చిబౌలి భూమిపై టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..”
Comments are closed.