వరంగల్ నిట్‌లో విద్యార్థి ఆత్మహత్య: హృతిక్ సాయి మృతదేహం చెరువులో గుర్తింపు

వరంగల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (NIT) చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22), బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి, ఆత్మహత్య చేసుకున్నాడు.

బుధవారం నుంచి కనిపించకపోవడంతో స్నేహితులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆయన కోసం గాలించిన వారు, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం కాలేజీ సమీపంలోని వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని దాన్ని వెలికి తీశారు.

తరువాత మృతుడిని హృతిక్ సాయిగా గుర్తించారు. తక్కువ మార్కులు రావడమే ఆయన మనోవేదనకు కారణమై ఉండొచ్చని స్నేహితులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నివేదిక తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read More : తెలంగాణకు భూకంప హెచ్చరిక: రామగుండం ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు వచ్చే అవకాశం