తెలంగాణలో భూకంప హెచ్చరికలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. భవిష్యత్తులో రామగుండం పరిసర ప్రాంతాల్లో తీవ్ర భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ వెల్లడించింది.
ఈ సంస్థ తాజా నివేదికలో, రామగుండంలో సంభవించే ప్రకంపనల ప్రభావం హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు ఉండవచ్చని పేర్కొంది. భూకంప తీవ్రత గట్టిగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నివేదిక వెలుగులోకి రాగానే భూకంప ప్రభావిత ప్రాంతాలైన రామగుండం, హైదరాబాద్, అమరావతి ప్రాంతాల్లో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే సమాచారాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకునే దిశగా పని ప్రారంభించినట్లు సమాచారం.
అసలైన ప్రమాదాన్ని నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఏదైనా అసాధారణ ప్రకంపనలు గుర్తించిన వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తదుపరి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ప్రజలు శాంతియుతంగా ఉండాలని, అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
Read More : కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య ఘర్షణ

2 thoughts on “తెలంగాణకు భూకంప హెచ్చరిక: రామగుండం ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు వచ్చే అవకాశం”
Comments are closed.