అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం:

అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాజమండ్రి కేంద్రంగా పచ్చడి బిజినెస్‌ నడిపిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు – అలేఖ్య, చిట్టి, రమ్య – కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఓ కస్టమర్ పచ్చడి ధరపై సందేహం వ్యక్తం చేయడంతో రమ్య కంచర్ల దుర్భాషతో స్పందించిందన్న ఆరోపణలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ ఆడియో వైరల్ కావడంతో పికిల్స్ బ్రాండ్‌కి తీవ్ర దెబ్బ తగిలింది. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయడం, వెబ్‌సైట్ డౌన్ కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ వివాదం పై యూట్యూబర్ నా అన్వేషణ స్పందిస్తూ, “వాళ్లు నా చెల్లెళ్లలాంటివాళ్లు, ఒత్తిడిలో తిట్టారు, క్షమించండి” అంటూ సమర్థించారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనను తెచ్చిపెట్టాయి. వ్యాపారంలో కస్టమర్‌ను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఒత్తిడిలో తిట్టినట్టు చెప్పడాన్ని సరైన న్యాయంగా చూడలేమని వారు విమర్శించారు.

అలేఖ్య ఏప్రిల్ 5న క్షమాపణ వీడియో విడుదల చేసినా, అది కేవలం డామేజ్ కంట్రోల్ మాత్రమేనని పలువురు అంటున్నారు. మరోవైపు, అలేఖ్య ఆరోగ్య పరిస్థితి విషమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ట్రోలింగ్ వల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, రమ్య కంచర్ల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనబోతుందన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి ఈ రూమర్స్‌కు బలం చేకూర్చినట్లు తెలుస్తోంది.

Read More : శ్రీ సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమలో భారీ చోరీ .

One thought on “అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం:

Comments are closed.