అనంతపురం జిల్లా JNTU కళాశాల సమీపంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాయ్స్ హాస్టల్లో వంటమనిషిగా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి తన మూడేళ్ల కూతురిపై కిరాతకంగా దాడి చేశాడు.
చిన్నారి ఎక్కడ పడితే అక్కడ మూత్రవిసర్జన చేస్తుందన్న కారణంతో, శివ కోపంతో ఆ చిన్నారిని అమానుషంగా కొట్టాడు. తండ్రిగా ముద్దు పెట్టాల్సిన వయసులో తన చేతులతోనే చిన్నారిపై కర్కశంగా ప్రవర్తించడం స్థానికులను దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చిన్నారి పరిస్థితిపై స్థానికుల ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More : అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం:
