2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు ₹1 లక్ష కోట్ల వరకు ఖర్చు జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై భారీ ఖర్చులు జరుగుతాయన్న ఆమె వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఒకే సమయంలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’’ (One Nation, One Election) అమలుచేస్తే, దాదాపు 1.5 శాతం జీడీపీ వృద్ధి నమోదు అవుతుందనీ, దీని విలువ పరంగా చూస్తే ₹4.5 లక్షల కోట్ల మేర దేశ ఆర్థిక వ్యవస్థకు అదనపు లాభం చేకూరుతుందనీ మంత్రి పేర్కొన్నారు.
ఇలాంటి సమన్వయ ఎన్నికల ద్వారా ఖర్చులను తగ్గించడంతో పాటు పరిపాలనా యంత్రాంగంపై భారం తగ్గుతుందని, అభివృద్ధి పనులకు మరింత సమయం కేటాయించగలమని ఆమె వివరించారు. ఒక్కోసారి వచ్చే ఎన్నికల మూడ్ దేశవ్యాప్తంగా ప్రగతిని ప్రభావితం చేస్తుందన్న అంశాన్ని కూడా ఆమె హైలైట్ చేశారు.
Read More : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..
