స్పర్శలో సీక్రెట్‌ ఉంది: టచ్ మీ నాట్ ఎంతవరకు మెప్పించిందో?

Touch Me Not Telugu Web Series

తెలుగులో తాజాగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ ‘టచ్ మీ నాట్’ ఓటీటీలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవదీప్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరీస్‌ను రమణ తేజ దర్శకత్వం వహించగా, జియో సినిమాస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకుల ఆదరణ పొందే కథా శైలి, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఈ సీరీస్ వీకెండ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

కథలోకి వెళితే, 2009 దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోని మారుతి అపార్టుమెంట్‌లో నాలుగు హత్యలు జరుగుతాయి. ఈ ఘటనలో రాఘవ (నవదీప్) తల్లిని కోల్పోతాడు, రిషి (దీక్షిత్ శెట్టి) తన తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వస్తుంది. పదేళ్ల తర్వాత రాఘవ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. రిషికి ఒక ప్రత్యేక శక్తి — సైకోమెట్రి — వస్తుంది, అంటే ఏదైనా వస్తువు లేదా వ్యక్తిని టచ్ చేస్తే, దాని గతం గురించి తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి మారుతి అపార్టుమెంట్ కేసు తెరపైకి వస్తుంది. రిషి శక్తిని ఉపయోగించి రహస్యాలు బయటకు తీసే ప్రయత్నం చేయడం ఈ సీరీస్ కథాంశం.

‘టచ్ మీ నాట్’ కొరియన్ డ్రామా ‘హీ ఇజ్ సైకోమెట్రిక్’ ఆధారంగా రూపొందించబడింది. అయితే, కథలో ఉన్న నూతనత, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, కథనం కొంత మేర ల్యాగ్ అయింది. మొదటి సీజన్ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో రూపొందించగా, తెలుగు సహా మరో ఆరు భాషల్లో విడుదల చేశారు. తొలి ఎపిసోడ్స్ ఆసక్తికరంగా కనిపించినా, తరువాతి భాగాల్లో నెమ్మదిగా సాగుతుండటంతో కొంత బోర్ ఫీలింగ్ కలిగించేలా ఉంటుంది. కానీ, రెండో సీజన్‌కు బలం కల్పించేలా క్లైమాక్స్‌ను డిజైన్ చేయడం గమనార్హం.

Read More



One thought on “స్పర్శలో సీక్రెట్‌ ఉంది: టచ్ మీ నాట్ ఎంతవరకు మెప్పించిందో?

Comments are closed.