ముంబయి ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ కావడం, దానికి ముంబయి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్మను హఠాత్తుగా క్రీజ్ నుంచి వెనక్కి పిలిపించడంపై వివాదం మొదలైంది. ఈ విషయాన్ని కోచ్ జయవర్దనే ముందుగానే సూర్యకుమార్ యాదవ్‌కి తెలియజేయగా, ఆయన ‘‘ఎందుకు?’’ అనే ప్రశ్నతో షాక్‌కు లోనయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిలక్ వర్మ స్థానంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ శాంట్నర్ కేవలం రెండు బంతులే ఆడి పెవిలియన్‌కు చేరాడు. దీంతో, మ్యాచ్ మధ్యలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు ముంబయి యాజమాన్యంపై వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ నిర్ణయం ఆటగాడి కాన్ఫిడెన్స్‌కి తీవ్రంగా ఝలక్ ఇవ్వవచ్చని హెచ్చరిస్తున్నారు.

Read More : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో Ms Dhoni Cskకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

2 thoughts on “ముంబయి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు..”
Comments are closed.