ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘అవతార్’ సిరీస్‌లో మూడవ చిత్రం ‘ఫైర్ అండ్ యాష్’పై ఆసక్తి తారాస్థాయికి చేరింది. ఇటీవల జరిగిన 2025 సినిమా కాన్ ఈవెంట్‌లో ప్రముఖ నటి జోయ్ సల్దానా టీజర్‌ను విడుదల చేయడం, అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. రెండవ భాగమైన ‘ది వే ఆఫ్ వాటర్’లో నెటెయెమ్ మృతితో ముగిసిన కథ, మూడవ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్‌తో కొనసాగనుందని టీజర్ హింట్ ఇచ్చింది.
ఫైర్ అండ్ యాష్’లో పండోరా ప్రపంచాన్ని మరింత విస్తరించనున్నట్లు జోయ్ వెల్లడించారు. ఈ సినిమాలో రెండు కొత్త తెగలు పరిచయం కానున్నాయి. ఒకవైపు శాంతి కోసం జీవించే విండ్‌ట్రేడర్స్ అనే విమాన యాత్రికుల తెగ ఉండగా, మరోవైపు యుద్ధాలను ప్రాధాన్యంగా చూసే యాష్ తెగ ఉంటుంది. వీరిద్దరి మధ్య గొడవలు, మళ్లీ మానవ జాతి పండోరా వైపు అడుగులు వేస్తుంది.
జేమ్స్ కామెరూన్ ఈ సారి మరింతగా ఎమోషన్‌పై దృష్టి పెట్టారని సమాచారం. ఇప్పటికే రెండు సినిమాలతో టెక్నికల్ అద్భుతాలు చూపించిన ఆయన, ఈసారి సాంకేతికతతో పాటు పాత్రల భిన్నత్వం, డీప్ స్టోరీలైన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని రచయిత అమండా సిల్వర్ వెల్లడించారు. ‘ఫైర్ అండ్ యాష్’లో విభిన్నమైన విలన్లు, సర్ప్రైజ్ ట్విస్టులు ప్రేక్షకులకు ఊహించని అనుభవాన్ని ఇస్తాయని అన్నారు.

One thought on “అవతార్ 3కు రెడీ అవుతున్న ప్రపంచం: కామిక్‌కాన్‌లో బిగ్ లీక్స్”
Comments are closed.