వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం – దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్

వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో దేశంలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. భారత జాతీయ జెండాలను అలవరచుకుని, “Reject Waqf Bill” అనే పోస్టర్లతో వారు ఆందోళన చేశారు.

ఇక, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. “దేశాన్ని చీల్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది” అంటూ ఆమె మండిపడ్డారు. వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కేంద్రం బిల్లుపై స్పష్టత ఇవ్వాలని, మైనారిటీల హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Read More : వక్ఫ్ (సవరణ) బిల్లు పార్లమెంటులో ఆమోదం – ప్రధాని మోదీ స్పందన..

One thought on “వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం – దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్

Comments are closed.