యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన వైష్ణవి చైతన్య, 2018లో రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రంలో చిన్న పాత్రలో నటించి వెండితెరకు అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆమె, 2023లో బేబీ సినిమాతో సోలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రంలో వైష్ణవి నటనకు విశేష ప్రశంసలు లభించాయి. అయితే, ఈ సినిమా తర్వాత వచ్చిన లవ్ మీ అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
ప్రస్తుతం వైష్ణవి చైతన్య, సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న జాక్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం వైష్ణవి కెరీర్‌కు కీలకమని భావిస్తోంది. అందుకే, ఈ చిత్రం విడుదలైన తర్వాతనే కొత్త ప్రాజెక్టులను అంగీకరించాలనే నిర్ణయం తీసుకుందట. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించాలనే ఆమె ఆశ, జాక్ విజయంపై ఆధారపడి ఉందని సమాచారం.
తెలుగు సినీ పరిశ్రమలో నేటి వరకు చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. బేబీ విజయం తర్వాత వైష్ణవి చైతన్యకు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అవకాశాలు వచ్చినా, ఆమె అత్యంత జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటోంది. జాక్ సినిమా పెద్ద హిట్ అయితే, తెలుగు అమ్మాయిలకు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు ఉండవన్న సెంటిమెంట్‌ను ఆమె బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

One thought on “జాక్ విజయం పై వైష్ణవి చైతన్య ఆశలు!”
Comments are closed.