పవన్ కల్యాణ్ 12 రోజుల డేట్స్.. ‘హరిహర వీరమల్లు’ మే 9న రావడం ఖచ్చితమేనా?

Pawan Kalyan Hari Hara Veera Mallu update

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా మే 9న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ చేసేందుకు వారు పట్టుదలగా ఉన్నారు. కానీ గతంలో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈ తేదీకైనా నిజంగానే విడుదల అవుతుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఎన్నికల ముందూ, తర్వాతా ఈ సినిమా విడుదలపై మారుతున్న ప్రకటనలు గమనిస్తే, ఆ అనుమానాలు తప్పవు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. పవన్ కల్యాణ్ ఈ సినిమాకి మొత్తం నాలుగు రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉందని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 12 రోజులకు పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానులకు షాకింగ్ న్యూసే. ఇప్పటికే నాలుగు రోజులు కేటాయించడానికే ఇంత హంగామా నడుస్తుంటే, ఇప్పుడు 12 రోజులు అవసరమైతే సినిమా మే 9న విడుదల అవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒకవేళ పవన్ నిజంగానే 12 రోజుల షూటింగ్ అందిస్తే, మొత్తం చిత్రీకరణ పూర్తయ్యేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరమని తెలుస్తోంది. అంటే మేకర్స్ గంటలు లెక్కపెట్టుకుంటూ, నిరంతరాయంగా పనిని ముగించాల్సిన పరిస్థితి. అంతే కాదు, షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరగాలి. ఇన్ని రోజులు లాగిన సినిమా ఇప్పుడు ఒక్కసారిగా పూర్తవుతుందా? లేక మళ్లీ ఓ కొత్త వాయిదా ఎదురుకానుందా? అన్నదే చూడాలి!

Read More

One thought on “పవన్ కల్యాణ్ 12 రోజుల డేట్స్.. ‘హరిహర వీరమల్లు’ మే 9న రావడం ఖచ్చితమేనా?

Comments are closed.