టీం ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఇటీవల తన భార్య ధన్య శ్రీకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విడాకులు అభిమానులను ఎంతో ఆవేదనకు గురి చేశాయి. చాహల్ వైవాహిక జీవితం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, అతడు మరో ప్రేమకథలో ఉన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో చాహల్, రేడియో జాకీ మహ్వశ్ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి. మహ్వశ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆమె మాట్లాడుతూ, తన జీవితంలోకి వచ్చే వ్యక్తి ఒక్కరే ఉంటాడని, అతడే తన స్నేహితుడు, ప్రియుడు అని పేర్కొంది.
ఈ పోస్ట్‌కు చాహల్ లైక్ చేయడం వల్ల వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం దాదాపు కన్ఫర్మ్ అయిందని నెటిజన్లు భావిస్తున్నారు. మహ్వశ్ తన పోస్ట్‌లో “నాకు అవసరం లేని వ్యక్తులు, నాతో అవసరం ఉందని భావించే వ్యక్తులు వద్దు. నా అవసరం కోసం ప్రయత్నించే అబ్బాయిలతో మాట్లాడాలి అనుకోవడం లేదని” అన్నారు. ఈ వ్యాఖ్యలు, చాహల్ లైక్ చేసిన నేపథ్యంలో, వీరిద్దరి ప్రేమ గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు. మహ్వశ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో చాహల్, మహ్వశ్ గురించి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాహల్ లైక్ చేయడం ద్వారా వీరి ప్రేమకథపై ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు వీరి సంబంధాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతుండగా, మరికొందరు చాహల్ వ్యక్తిగత జీవితంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ జంట గురించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది.

One thought on “చాహల్ – మహ్వశ్ ప్రేమకథ: సోషల్ మీడియాలో హాట్ టాపిక్”
Comments are closed.