పార్టీ కార్యకర్తల సమావేశంలో, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో మంగళవారం, పర్చూరు నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో, చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. “కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సులతో పదవులు ఇవ్వబోము. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీకి అత్యధిక ఓట్లు సాధించిన వారిని గుర్తిస్తాం,” అని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాక, చంద్రబాబు నాయుడు, “పనితీరును ప్రామాణికంగా తీసుకుని, నేతలు, కార్యకర్తలకు నామినేటెడ్, పార్టీ పదవులు కేటాయిస్తాం,” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, “మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి రేటింగ్లు ఇస్తాం. దీని ద్వారా పనితీరును మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఎవరినైనా పక్కన పెడతాం. సమర్థులను మాత్రమే అవకాశం ఇస్తాం,” అని చంద్రబాబు హెచ్చరించారు.
Read More : వల్లభనేని వంశీకి మరోసారి షాక్.. రిమాండ్ పొడిగింపు..

One thought on “చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు: “మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సులతో పదవులు ఇవ్వబోము”…”
Comments are closed.