మ్యాన్మార్‌కు భారత సహాయం – ‘ఆపరేషన్ బ్రహ్మా’ ద్వారా 15 టన్నుల నిత్యావసర సరఫరాలు…

భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గండం వచ్చినప్పుడు తోడుగా నిలిచే తన నిబద్ధతను చాటుకుంది. మయన్మార్‌లో సహాయ చర్యల కోసం “ఆపరేషన్ బ్రహ్మా” పేరుతో భారీ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 15 టన్నుల నిత్యావసర సామగ్రిని మయన్మార్‌కు పంపించింది. ఇది భారత ప్రజలు, భారత ప్రభుత్వానిచే అందించిన విలువైన కానుకగా పేర్కొనవచ్చు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సహాయ చర్యలపై స్పందిస్తూ, “భారతదేశం మయన్మార్ ప్రజలతో ఐక్యతగా నిలుస్తుంది. అవసరమైన అన్ని విధాలుగా మేము మయన్మార్‌కు సహాయం అందిస్తాము” అని ప్రకటించారు. భారత వైమానిక దళం (IAF) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాల ద్వారా ఈ సహాయ సామగ్రిని మయన్మార్‌కు రవాణా చేసింది. ఈ సహాయ కిట్‌లో ఆహార పదార్థాలు, మెడికల్ కిట్లు, అత్యవసర వైద్య సేవల బృందాలు, రక్షణ బృందాలు వంటి అవసరమైన సరఫరాలు ఉన్నాయి.

భారత ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. అత్యవసర సమయంలో మయన్మార్‌కు మద్దతుగా నిలిచేందుకు భారతదేశం గట్టి నిశ్చయంతో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని సహాయ చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. “ఆపరేషన్ బ్రహ్మా” ద్వారా మరోసారి భారతదేశం తన సహానుభూతిని ప్రపంచానికి చాటింది.

One thought on “మ్యాన్మార్‌కు భారత సహాయం – ‘ఆపరేషన్ బ్రహ్మా’ ద్వారా 15 టన్నుల నిత్యావసర సరఫరాలు…

Comments are closed.