మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై విమర్శలు..

బీఆర్ఎస్‌ నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన ఆయన, హీరోయిన్ కసీ కపూర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. “హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. కానీ నిజంగానే కసికసిగా ఉంది” అంటూ స్టేజ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.

ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాప్రతినిధిగా ఉండి, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని మండిపడ్డాయి. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి సినిమా ఈవెంటుకు హాజరుకావడంపై రాజకీయ వర్గాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ఎమ్మెల్యే, అసెంబ్లీకి డుమ్మా కొట్టి సినిమా కార్యక్రమానికి హాజరవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలోనూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ఘటనపై ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Read More : తెలంగాణ బీజేపీపై అమిత్‌ షా క్లాస్‌.. ?

One thought on “మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై విమర్శలు..

Comments are closed.