కడప జిల్లా ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదు

instagram harassment

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాఠశాలలోని బాలికలకు అసభ్య సందేశాలు పంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆ విద్యార్థితో పాటు అతని తల్లిదండ్రులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

32 ఫేక్ అకౌంట్లతో బెదిరింపు

వివరాల ప్రకారం, విద్యార్థి 32 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీల ద్వారా తన పాఠశాలలోని బాలికలకు అసభ్యకర మెసేజులు పంపించేవాడు. తనను ప్రేమించాలని, లేదంటే వారి ఫోటోలు , వీడియోలు, ఫోన్ నంబర్లు లీక్ చేస్తానని బెదిరించేవాడు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం..?

బాలుడి తల్లిదండ్రులకు ఈ వ్యవహారం తెలియగానే అతడిని మందలించాల్సిన అవసరం ఉండగా, ఆయన ప్రవర్తనను ప్రోత్సహించారని బాధిత బాలికల తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా, తమ కుమారులను బెదిరించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల చర్య

ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం (POCSO Act) కింద బాలుడు, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు సూచించారు.

Read More : కర్నూల్‌లో భారీ పెట్టుబడులు.. డ్రోన్ సిటీ అభివృద్ధికి గరుడ ఎయిరోస్పేస్ భారీ ప్రణాళిక!