చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన – IIT Madrasలో AIRSS 2025లో పాల్గొననున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఇవాళ చెన్నై (Chennai) పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ (Vijayawada) నుంచి బయలుదేరి మీనంబక్కం (Meenambakkam) పాత విమానాశ్రయం లోని VIT గేట్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) క్యాంపస్‌కు వెళ్లనున్నారు.

ఈ పర్యటనలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ (All India Research Scholars Summit – AIRSS 2025) లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం.

ఇందుకోసం చెన్నైలోని తెలుగు దేశం పార్టీ (TDP) సభ్యులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సమ్మిట్‌లో పాల్గొని, అనంతరం అన్ని అధికారిక కార్యక్రమాలను ముగించుకుని సాయంత్రం 4:00 గంటలకు తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.

Read More : వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయమంగళ.. చంద్రబాబు ఆశీస్సులు పొందిన వెంటనే టీడీపీ చేరిక?