సక్సెస్ అంటే నాకు ఫ్రీడమ్ – సమంతా రుత్ ప్రభు..

samantha

ఇటీవలే సిడ్నీలో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీ (Indian Film Festival of Sydney – IFFS) 11వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సమంతా, మహిళల కోసం సక్సెస్ అనేది కేవలం విజయాలు సాధించడం మాత్రమే కాకుండా, సమాజం విధించిన స్టీరియోటైప్స్ (Stereotypes) నుండి విముక్తి పొందడం కూడా అని వెల్లడించారు. స్వేచ్ఛను అంగీకరించడం, విభిన్న పాత్రలను నిర్వర్తించడం, మహిళలు ఏమి చేయగలరు, చేయలేరనే పురాతన భావనలకు సవాలు విసరడం ఎంతో ముఖ్యమని చెప్పారు.

‘ఖుషి’ (‘Kushi’) చిత్ర నాయిక సమంతా మాట్లాడుతూ, “నేను ఇప్పటికే చెప్పాను – నా దృష్టిలో సక్సెస్ అంటే ఫ్రీడమ్ (Freedom). నాకు ఎవరో వచ్చి విజయవంతమైన వ్యక్తినని చెప్పేంత వరకు నేను ఎదురు చూడను. సక్సెస్ అనేది నన్ను ఉత్తేజపరిచే పనులు చేసేందుకు స్వేచ్ఛను కలిగి ఉండడం. ఒక బాక్స్ (Box) లో పెట్టి, మహిళలు చేయగలిగేది, చేయలేనిదీ నిర్ణయించబడటాన్ని అంగీకరించకపోవడం. అనేక పాత్రలు పోషిస్తూ, వాటిని సమర్థంగా నిర్వర్తించడం” అని వివరించారు.

సిడ్నీ పవర్ హౌస్ మ్యూజియం (Powerhouse Museum) వేదికగా, ఫెస్టివల్ డైరెక్టర్ (Festival Director) నిర్వహించిన ఆసక్తికర చర్చలో, సమంతా తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఎన్నో అడ్డంకులను దాటి, మున్ముందు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ తన కెరీర్ (Career) ను తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారని అన్నారు.

ఇక ప్రొడ్యూసర్ (Producer) గా మారడం తనకు మరింత ఎంపవర్మెంట్ (Empowerment) ఇచ్చిందని, విభిన్నమైన కథలను సమర్థించడానికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. సెల్ఫ్ బిలీఫ్ (Self-belief) ను అలవరుచుకోవడం, సమతుల్యతను కనుగొనడం, తన వాల్యూస్ (Values) కు అనుగుణమైన పనులను ఎంచుకోవడం గురించి వివరించారు.

ఫెస్టివల్ డైరెక్టర్ మితు భోమిక్ లాంగే (Mitu Bhowmick Lange) మాట్లాడుతూ, “సమంతా ప్రయాణం ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీ సారాంశాన్ని ప్రతిబింబిస్తోంది – పట్టుదల, నిజమైన కథనాలు, విభిన్న గొంతులను ప్రోత్సహించడం. ఈ ఏడాది ఫెస్టివల్‌కు ఆమె నాయకత్వం వహించడంపై మేము గర్వంగా ఉన్నాము” అని అన్నారు.

Read More : కీర్తి సురేష్‌కు బాలీవుడ్‌లో రెండో అవకాశం: సూపర్‌స్టార్‌తో కొత్త ప్రాజెక్ట్?