‘మ్యాడ్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. రెట్టింపు హాస్యంతో మ్యాడ్ స్క్వేర్!

MAD 2 Trailer

2023లో విడుదలైన మ్యాడ్ సినిమా యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మ్యాడ్ 2 (మ్యాడ్ స్క్వేర్)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచింది. మొదటి భాగంలో ఉన్న కామెడీని రెట్టింపు చేసి, మరింత ఫన్నీ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేందుకు చిత్రబృందం సిద్ధమైంది.

ట్రైలర్‌ చూస్తే, మొదటి భాగం చూసి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు మరింత ఫన్ అందిస్తామని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు. ట్రైలర్‌లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మళ్లీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నారు. హాస్యాస్పదమైన డైలాగులు, విచిత్రమైన సన్నివేశాలు సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని స్పష్టంగా తెలుస్తోంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు అదనపు బలం ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన “లడ్డు గాని పెళ్లి”, “స్వాతి రెడ్డి”, “వచ్చార్రోయ్” పాటలు ట్రెండింగ్‌లో నిలవగా, భీమ్స్ మ్యూజిక్ సినిమాకు మ్యూజికల్ హిట్‌గా నిలిచేలా చేస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తనదైన హాస్య శైలిని మరోసారి చూపించబోతున్నారు. మార్చి 28, 2025న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా, వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించనుంది. మ్యాడ్ ఫ్రాంచైజీ హిట్టయిన రీతిలోనే, ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించబోతుందా? అనేది చూడాలి!

Read More

One thought on “‘మ్యాడ్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. రెట్టింపు హాస్యంతో మ్యాడ్ స్క్వేర్!

Comments are closed.