ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు – నిర్మలా సీతారామన్

మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న పలు ముఖ్య అంశాలు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి.

మధ్య తరగతి, వృద్ధులకు ఉపశమనం
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి వర్గానికి ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించడంతో పాటు పలు నియమాల్లో మార్పులు చేశారు. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.

సీనియర్ సిటిజన్లకు మేలు
సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు. అలాగే, ఇంటి యజమానులకు అద్దె ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు.

విదేశీ లావాదేవీలు, విద్యా రుణంపై మార్పులు
RBI సరళీకృత రెమిటెన్స్ పథకంలో భాగంగా టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అంతేకాకుండా, విద్యా రుణాలపై రూ.7 లక్షల మించి లావాదేవీలకు 5% TCS విధించారు.

డివిడెండ్, మ్యూచువల్ ఫండ్ ఆదాయంపై పెంపు
డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు. అదే విధంగా, మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై టీడీఎస్ పరిమితిని రూ.10,000కి పెంచారు. బహుమతులకు సంబంధించిన టీడీఎస్ పరిమితిని కూడా రూ.10,000కి పెంచారు.

LPG, CNG, ATF ధరల్లో మార్పులు
ఏప్రిల్ 1 నుంచి చమురు కంపెనీలు గ్యాస్ (LPG), ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), CNG-PNG రేట్లను సమీక్షించనున్నాయి. ఈ మార్పులతో ధరల్లో మార్పులు సంభవించే అవకాశం ఉంది.

ఈ మార్పులు ప్రజలకు అనేక విధాలుగా ఉపశమనం కలిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

Read More

One thought on “ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు – నిర్మలా సీతారామన్

Comments are closed.