సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానుల్లో ఆందోళన రేపింది. లండన్ నుంచి చెన్నై తిరిగి వచ్చిన అనంతరం అలసట, డీహైడ్రేషన్ కారణంగా రెహమాన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదే సమయంలో రెహమాన్ భార్య సైరా గురించి సోషల్ మీడియాలో కొన్ని అనవసర వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తన గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని సైరా స్పష్టంగా తెలిపింది. “నేను రెహమాన్ గారి మాజీ భార్యను కాను. మా కుటుంబంపై నిరాధారమైన వార్తలు సృష్టించడం మానేయండి” అంటూ ఆమె తేల్చి చెప్పారు.
ఇక రెహమాన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు వెల్లడించారు.

One thought on “నేను మాజీ భార్యను కాదు: రెహమాన్ భార్య సైరా స్పష్టీకరణ”
Comments are closed.