యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. మార్చి 28న ఈ చిత్రం జపాన్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ గత మూడు రోజులుగా అక్కడే బిజీగా ఉన్నారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కూడా రావడం విశేషం. అందుకే ఎన్టీఆర్ ఈ ప్రత్యేకమైన రోజును తన భార్యతో కలిసి జపాన్‌లోనే ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అందమైన ఫొటోను షేర్ చేస్తూ, “అమ్మలు… హ్యాపీ బర్త్‌డే…” అని క్యాప్షన్ ఇచ్చారు. భార్య పుట్టినరోజున ప్రత్యేకంగా జరుపుకుంటూ, ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ప్రేమపూర్వక శుభాకాంక్షలు నందమూరి అభిమానుల హృదయాలను దోచుకుంటున్నాయి.

ఇక దేవర చిత్రం వల్ల ఎన్టీఆర్‌కి ఈ జపాన్ ట్రిప్ ఓ స్పెషల్ మేమొరీగా మారింది. ఒకవైపు తన సినిమా ప్రమోషన్ కొనసాగిస్తూనే, మరోవైపు ఇంటర్నేషనల్ హాలిడే కూడా ఎంజాయ్ చేసే చాన్స్ దొరికింది. ఎన్టీఆర్ ఈ నెలాఖరులోగా భారత్‌కు తిరిగి వచ్చి, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరి సినిమాను ప్రారంభించనున్నాడు.

One thought on “జపాన్‌లో ఎన్టీఆర్ భార్య ప్రణతి బర్త్‌డే సెలబ్రేషన్”
Comments are closed.