ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టతనిచ్చారు. మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ సభ్యులు చేసిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లోకేష్ మాట్లాడారు.
వైసీపీ హయాంలో రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. 2019లో ఆనాటి ప్రభుత్వం వేసిన బకాయిలను వైసీపీ ప్రభుత్వం 16 నెలల తర్వాత చెల్లించిందని ఆయన వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు మాత్రమే అయిందని, బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
బీఏసీ సమావేశంలో విద్యారంగంపై చర్చ జరిపేందుకు ఒప్పుకున్నామని, అయితే ఆ చర్చకు వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారని లోకేష్ విమర్శించారు. వాస్తవాలు వినేందుకు వైసీపీ సిద్ధంగా లేదని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపించారు.
మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. బకాయిల చెల్లింపుపై పూర్తి వివరాలను చదివి తెలుసుకోవాలని లోకేష్ సూచించారు.

One thought on “ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మంత్రి లోకేష్ స్పష్టత”
Comments are closed.