చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూర’ టీజర్ రిలీజ్ – మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న హీరో?

veera-dheera-sooran-vikram-sj-suryah-teaser

చియాన్ విక్రమ్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీర ధీర శూర’ తాజాగా విడుదలైన టీజర్‌తో అంచనాలను పెంచేసింది. ఎస్.యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హెచ్.ఆర్ పిక్చర్స్, రియా శిభు నిర్మించారు.

విక్రమ్ గతంలో సిద్ధార్థ్ నటించిన ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’) సినిమాను తెరకెక్కించిన అరుణ్ కుమార్, ఇప్పుడు పూర్తి రూరల్ యాక్షన్ నేపథ్యంలో ‘వీర ధీర శూర’ చిత్రాన్ని తెరకెక్కించారు.

టీజర్‌లో విక్రమ్ రేషన్ డీలర్ పాత్రలో కనిపించగా, అతని జీవితంలో ఒక కీలక యుద్ధం జరుగుతుంది. ఎస్.జె సూర్య పోలీస్ అధికారిగా నటిస్తుండగా, వీరిద్దరి మధ్య సాగే అంతరంగిక పోరాటమే కథాంశంగా కనిపిస్తోంది.

విక్రమ్ మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకోగా, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాపై అంచనాలను పెంచాయి. జివి ప్రకాష్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా మారింది.

తాజాగా విడుదలైన ‘తంగళాన్’ పర్వాలేదనిపించినప్పటికీ, ‘వీర ధీర శూర’ ద్వారా విక్రమ్ తిరిగి సూపర్‌హిట్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే, విక్రమ్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టే!

ఈ చిత్రం తెలుగు వెర్షన్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేసింది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, విక్రమ్ అభిమానులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి!

Read More

One thought on “చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూర’ టీజర్ రిలీజ్ – మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న హీరో?

Comments are closed.