మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధికి కృతనిశ్చయంతో ముందుకు

_Nara-Lokesh

మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు మంగళగిరి నియోజకవర్గంలోని యర్రబాలెం ఇండస్ట్రీయల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏపీలో ఎప్పుడూ జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాను” అని పేర్కొన్నారు.

మంగళగిరిలో Gems and Jewellery Park ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచినందుకు మంగళగిరి ప్రజల రుణాన్ని తీర్చుకునేలా పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Read More

One thought on “మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధికి కృతనిశ్చయంతో ముందుకు

Comments are closed.