భారత మార్కెట్‌లో ప్రముఖ ఇంటర్నెట్ సేవా సంస్థ స్టార్లింక్ ధరలు వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సేవలను వినియోగించుకోవాలంటే వినియోగదారులకు నెలసరి ఖర్చులు రూ.8,000 నుంచి రూ.41,000 వరకు ఉండనున్నట్లు సమాచారం. అంతే కాదు, ఒకేసారి చెల్లించాల్సిన హార్డ్‌వేర్ ఖర్చులు సైతం రూ.20,000 నుంచి రూ.31,000 వరకు ఉంటాయని వెల్లడించారు.
ఇవే కాకుండా, ప్రస్తుత ఇంటర్నెట్ మార్కెట్‌లో పోటీ సంస్థలతో పోల్చితే స్టార్లింక్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, స్టార్లింక్ అధిక వేగం, విశ్వసనీయత, మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించగలదనే ప్రత్యేకతతో ఈ ధరలకు న్యాయం చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత వినియోగదారులు అధిక ఖర్చులనైనా భరించి స్టార్లింక్ సేవలను ఎంచుకుంటారా? లేదా ఇతర ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

2 thoughts on “స్టార్లింక్ ఇంటర్నెట్ సేవల ధరలు భారత వినియోగదారులకు షాక్”
Comments are closed.