టాలీవుడ్లో సమంత రుత్ ప్రభు ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితే త్వరలోనే ఆమె దర్శకురాలు నందినీ రెడ్డితో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సమంత – రాజ్ నిడిమోరు డేటింగ్ చేస్తున్నారనే గాసిప్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
అంతకుముందు ఇద్దరూ కలిసి పికిల్‌బాల్ ఆడుతూ కనిపించడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా, మళ్లీ సమంత, రాజ్ కలిసి కనిపించడంతో వీరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల వీరిద్దరూ స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో సమంత ఆకుపచ్చ గౌనులో మెరిసిపోగా, రాజ్ క్యాజువల్ టీ-షర్ట్, జీన్స్‌లో కూల్ లుక్‌లో ఉన్నారు. గతంలోనూ ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు ఇదే తరహా రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి నెలకొనడంతో వీరి గురించి పుకార్లు మరింత పెరిగాయి.
సమంత, రాజ్ నిదిమోరు తొలిసారి ‘ది ఫ్యామిలీ మాన్ 2’ షూటింగ్ సమయంలో కలిశారు. ప్రస్తుతం వీరిద్దరూ మరో ప్రాజెక్ట్‌పై కలిసి పని చేస్తున్నారని సమాచారం. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు రాజ్ లేదా సమంత ఎవరు కూడా స్పందించలేదు.

One thought on “సమంత – రాజ్ నిదిమోరు డేటింగ్ పుకార్లు మరోసారి వైరల్!”
Comments are closed.