తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా, ఏప్రిల్ 7నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. తొలుత ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగియాల్సి ఉంది. అయితే హడావుడిగా పేపర్లు దిద్దుతున్నారని, ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు రోజుకు 50 పేపర్లు ఇవ్వడంతో మౌలిక సదుపాయాల లేని పరిసరాల్లో పని చేయాల్సి వస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సిద్దిపేట వంటి జిల్లాల్లో కొన్ని సబ్జెక్టుల మూల్యాంకనం ఇంకా పూర్తికాలేదని సమాచారం. ముఖ్యంగా సోషల్, ఇంగ్లిష్ పేపర్ల మూల్యాంకనం కొనసాగుతుండటంతో, పూర్తిచేయడానికి అసిస్టెంట్ ఎగ్జామినర్లపై పని భారం పెరిగింది. స్క్రూటినైజర్లకూ రోజుకు సగటున 200 పేపర్ల వరకు ఇవ్వడంతో వారు కూడా ఒత్తిడిలో ఉన్నారు.
వెచ్చిన పని భారం దృష్ట్యా పారితోషికాన్ని పెంచాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క పేపర్‌కు రూ.10, కన్వెన్స్ కింద రోజుకు రూ.50 చెల్లిస్తున్నా, ఇది తగినంత కాదని పేర్కొంటున్నారు. గత ఏడాది మాదిరి పారితోషికాన్ని ముందుగానే ఇవ్వాలని, ఈసారి మూల్యాంకనం ముగిసిన వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
రేపటికి మూల్యాంకనం పూర్తవకపోతే ఫలితాల వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశముంది. విద్యాశాఖ ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని చెప్పినా, తాజా పరిణామాల దృష్ట్యా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

One thought on “పదో తరగతి మూల్యాంకనం తుది దశలో – ఫలితాల విడుదల ఎప్పుడు?”
Comments are closed.