“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఏఐ రంగంలో ఒప్పందం: యువతకు నైపుణ్య శిక్షణ, వ్యాపార మద్దతు”

అమరావతి: ప్రజలకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలు, సేవలు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాటిని సెల్ఫోన్ ద్వారా అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. “ఈజ్ ఆఫ్ లివింగ్” విధానాన్ని ప్రజలకు చేరువ చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంపొందించి, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ బిక్రమిసింగ్ బేడి, ఏపీ రియల్టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్కుమార్ సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ద్వారా సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల శిక్షణ కార్యక్రమాలను చేపట్టేలా చేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ “యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్‌తో ఒప్పందం దోహదం చేస్తుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం లక్ష్యం. స్టార్టప్లను ప్రోత్సహించడం, వాటి ప్రయోజనాలను అందుబాటులోకి తేవాలన్నదే గూగుల్ ఒప్పందం ముఖ్య ఉద్దేశం” అని పేర్కొన్నారు.

గూగుల్ మ్యాప్స్ జీఎం లలితా రమణి ఈ ఒప్పందం ద్వారా పాలనలో ఏఐ వినియోగం ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించడంలో సహాయపడుతుందని చెప్పారు.

ఒప్పందంలో కీలక అంశాలు:

  1. విద్య, నైపుణ్యాభివృద్ధి:
    విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేలమందికి గూగుల్ నైపుణ్య శిక్షణ అందిస్తుంది. ఇందులో సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది.
  2. స్టార్టప్ ఎకోసిస్టం:
    స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రాంల కోసం గూగుల్ యాక్సెస్ ఇస్తుంది. ఏపీ స్టార్టప్ ఎకోసిస్టమ్తో కలిసి పనిచేస్తుంది. అర్హత కలిగిన ఏఐ స్టార్టప్లకు సాంకేతిక శిక్షణ, క్లౌడ్ క్రెడిట్లను అందిస్తుంది.
  3. సుస్థిరత:
    గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ వంటి సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్ సహకారం అందిస్తుంది.
  4. వైద్య సేవలు:
    ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం, రోగ నిర్ధారణ ఫలితాలను వేగవంతం చేయడంలో గూగుల్ సహకారం అందిస్తుంది.
  5. ఏఐ పైలట్లు:
    వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్సైట్ ఆధునికీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో పైలట్ ప్రాజెక్టులకు గూగుల్ సహకారం అందిస్తుంది.

అమరావతి: ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం గొప్ప ముందడుగుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తన నివాసంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు, కంట్రీ ఎండీ బిక్రమ్ సింగ్ బేడి, సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

“లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం దోహదం చేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.