హైదరాబాద్‌లో మహిళపై లైంగిక దాడి: సినిమా ఛాన్స్ పేరుతో అసిస్టెంట్ డైరెక్టర్ చేష్టలు

హైదరాబాద్: ఏపీకి చెందిన ఓ మహిళ సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్‌కు వచ్చింది. మొదట మణికొండలో నివసించిన ఆమె తరువాత అమీర్‌పేట్‌కు షిఫ్ట్‌ అయ్యింది. ఈ సమయంలో, సినిమాలో ఛాన్స్‌ ఇవ్వడం వంటూ ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా, అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సినిమాల్లో నటించాలని కోటి ఆశలతో నగరానికి వచ్చిన ఆ మహిళకు ఊహించని షాక్ తగిలింది.

సినిమా ఛాన్స్ కోసం నగరానికి వచ్చిన మహిళ, మణికొండలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ, అమీర్‌పేట్‌కు 15 రోజుల క్రితం షిఫ్ట్‌ అయ్యింది. అప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెను తనతో పరిచయం చేశాడు. “సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేస్తాను” అని ఆమెను నమ్మబలికాడు. ఆమెకు ఆడిషన్ల గురించి చెప్పి, మూడు రోజుల క్రితం ఒక హోటల్‌కు పిలిపించాడు.

మొదటి రోజు, ఫోటో షూట్ చేయడం వంటివి చేసి, మహిళకు నమ్మకం పెంచాడు. కానీ రెండవ రోజు, ఆమెను హోటల్‌కు పిలిచి, ఫోటో షూట్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆడిషన్ల పేరుతో గదిలోకి పిలిచి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తనకు జరిగిన ఘోరంపై పోలీసులను ఆశ్రయించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయబడింది.

ఇవి కూడా చదవండి…

One thought on “హైదరాబాద్‌లో మహిళపై లైంగిక దాడి: సినిమా ఛాన్స్ పేరుతో అసిస్టెంట్ డైరెక్టర్ చేష్టలు

Comments are closed.