వైరల్ న్యూస్: దుబాయ్‌లో దగ్గరైన సానియా మీర్జా, మహ్మద్ షమీ.. నిజమేనా?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటివల వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
వైరల్ న్యూస్: దుబాయ్‌లో దగ్గరైన సానియా మీర్జా, మహ్మద్ షమీ.. నిజమేనా?
గత కొన్ని రోజులుగా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిరదరి వ్యక్తిగత జీవితాలు వేరే అయినప్పటికీ, అభిమానులు వీరిని విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం సానియా, షమీ కలిసి దుబాయ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ బీచ్‌లో తిరుగుతున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫేస్‌బుక్‌లోని “క్రికెట్.గురు” అనే పేజీ ఈ విషయాన్ని ప్రచురించింది. ఆ పేజీలో సానియా, షమీ కలిసి ఉన్న ఫోటోలు కూడా షేర్ చేయబడ్డాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే..
ఈ ఫోటోలను ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు, అవి నిజం కాదని తేలింది. ఈ చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారుచేయబడ్డవని తెలియజేశారు. అంతేకాదు, మహమ్మద్ షమీ స్వయంగా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ఒక రోజు క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతో షమీ తన ప్రాక్టీస్ NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ)లో చేస్తున్నట్లు వెల్లడించారు, ఇది బెంగళూరులో ఉంది. అంటే, షమీ ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు, దుబాయ్‌లో లేరు.
గతంలో వీరిద్దరూ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే మహమ్మద్ షమీ కూడా తన భార్య హసిన్ జహాన్‌కు డివోస్ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిరదరు తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరికి క్రీడా నేపథ్యం ఉన్నందున, వారు ఒకటవుతారని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ వీరిద్దరూ అధికారికంగా ఎప్పుడూ ఈ విషయంపై ప్రకటన చేయలేదు.
