విత్తులోనే ఉంది భవిష్యత్తు
ప్రాణం పోసిన తల్లిదండ్రులను పాణంగా చూసుకోవాలని మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ఊరికి వచ్చాడు. పాణాలను హరించే తిండి కాదు, ఆయువు పోసే ఆహారం అందరికీ అందివ్వాలని రైతుగా మారాడు. రైతు ప్రాణం విత్తనంలోనే ఉందనీ, దాన్ని కాపాడుకునేందుకు దేశమంతా తిరిగాడు. దేశీ పంటల విత్తనం చచ్చిపోకుండా విత్తన సేద్యం చేశాడు. వేల రకాల వంగడాలను ప్రాణంలా కాపాడుకుంటున్న దార్లపూడి రవి విత్తులోనే.. రైతులు, భావితరాల భవిష్యత్తు ఉందంటున్నాడు!
వ్యవసాయం పట్ల ప్రేమ
నేను ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ చదివాను. మట్టపల్లి (సూర్యాపేట జిల్లా) దగ్గర ఉన్న నాగార్జున సిమెంట్స్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాను. మా తమ్ముడు బెంగళూరులో, చెల్లెలు ఉద్యోగం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మానాన్నలను చూసుకోవాలనుకున్నా! అలాగే నాకిష్టమైన వ్యవసాయం చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా ఊరు ఉంగరాడ (విజయనగరం)లో మాకు రెండు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ఉంది. అది కొండవాలు కింది పొలం. అందులో వర్షాధార పంటలే పండుతాయి. ఒక ఎకరా యాభై సెంట్లలో నాన్న మామిడి తోట పెట్టించారు. చెట్టుకు చెట్టుకు మధ్య 30 అడుగుల దూరం ఉంది. కాబట్టి అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉంది. అందులో పెసలు, ఉలవలు, నువ్వులు పండించాను.
వ్యవసాయంలోని సమస్యలు
పెండ్లిళ్లు, ఇతర వేడుకలకు వెళ్లినప్పుడు కొంతమంది గ్యాస్ట్రిక్ అల్సర్, అజీర్తి, పైల్స్, బీపీ వంటి అనారోగ్యాలు అంటుకున్నాయి. వారు తినడానికి ఆహారం తగ్గించారు. జిహ్వ చాపల్యం కొద్దీ తిన్నా.. ఇంటికి పోయి మాత్ర వేసుకుంటున్నారు. వీరి సమస్యలు రసాయనాలతో పండించిన పంటల వల్ల. ఈ దుస్థితి పోవాలంటే మళ్లీ సేంద్రియ వ్యవసాయం అవసరమన్నాను. రసాయన అవశేషాలు లేని కాయగూరలు, ధాన్యం పండించాలనుకున్నాను. ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూనే నా స్నేహితుడు నడిపే వ్యవసాయ సంబంధిత ఎన్జీవోలో చేరాను. రైతులతో కలిసి పయనించాను.
పాలేకర్ బాటలో
మాది వ్యవసాయ కుటుంబమే అయినా సాగు గురించి పూర్తిగా అవగాహన లేదు. మంచి ఆహార పంటలు పండించడం కోసం సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకున్నాను. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ శిక్షణ ఇచ్చారు. అక్కడ సుస్థిర వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ సేంద్రియ సాగు పద్ధతులను వివరించారు. ఆయన సేంద్రియ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు. సేంద్రియ రైతుల అనుభవాలు విన్నాను. పాలేకర్ నిర్వహించే అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అనేక ప్రాంతాలు తిరిగాను. రైతులతో మాట్లాడాను. వారి సాగు పద్ధతులు నేర్చుకున్నాను.
కొండపొలం
కొండవాలులో మాది మొదటి పొలం. కాబట్టి సేంద్రియ వ్యవసాయానికి అనువైనది. చుట్టూ జీవ వైవిధ్యం ఉంది. ఆ భూమిలో సేంద్రియ సాగు మొదలుపెట్టాను. ఎనభై సెంట్లలో వరి నాటాను. మామిడి తోటలో అంతర పంటగా పసుపు పెట్టాను. 30 సెంట్ల భూమిలో 30 కిలోల కస్తూరి పసుపు విత్తనం పెడితే మూడు వందల కేజీలు పండింది. ఎండబెడితే 160 కేజీల పసుపు వచ్చింది. పెద్ద కష్టం లేకుండానే పెట్టుబడి కంటే అనేక రెట్లు ఆదాయం వచ్చింది. నాగలితో దున్ని కొర్రలు వేశాను. మంచి దిగుబడి వచ్చింది. ఈ నేలను సారవంతం చేస్తే రకరకాల పంటలు సాగు చేసుకోవచ్చని అర్థమైంది. మట్టిలో సూక్ష్మ జీవులు పెరిగేలా జీవామృతం పోశాను. సేంద్రియ సేద్యంలోకి పూర్తిగా దిగాను.
సంవత్సరాల అనుభవం
ఏడేండ్ల కిందట కాంబోయిడియా వెళ్లాను. అగ్రిబడ్డీ సంస్థ తరపున అక్కడి రైతులతో వ్యవసాయం చేయించాను. అక్కడ రైతుల ఇళ్లు పొలాల మధ్యనే ఉంటాయి. ఆ ప్రాంతంలో నది పొంగితే నలభై అడుగుల ఎత్తున వరద ప్రవాహం ఉంటుంది. వానాకాలం పడవల్లో ప్రయాణిస్తారు. ఈ విధంగా ప్రకృతితో అనుగుణంగా జీవనం సాగించడంలో విజయం పొందిన వారి జీవనశైలిని చూసి నేర్చుకున్నాను.
విత్తం కన్నా విత్తే మిన్న
‘విత్తనం లేనిదే వ్యవసాయం లేదు. విత్తనం మంచిదైతే దిగుబడి మంచిదవుతుంది’ అని సుభాష్ పాలేకర్ చెప్పారు. దేశవాళీ విత్తనం ప్రాధాన్యాన్ని అవగాహన కల్పించారు. పంట ఉత్పత్తులకి ఎండల్లో క్యూ కట్టడం చూసి, విత్తన స్వావలంబన సాధించాలంటూ అడిగాను. అందుకోసం దేశవాళీ విత్తనాలు సేకరించాను.
ఆర్గానిక్ సీడ్ బ్యాంక్
ఆదిమ్, ఆందోళన్, నమ్మాళ్వార్ ఫౌండేషన్ వంటి సంస్థలతో కలిసి విత్తనాల కోసం ప్రయాణం ప్రారంభించాను. రైతుల విత్తనాలు సేకరించి వాటిని భద్రపరచడం, నేర్చుకుంటున్నాను. పాత పద్దతులు, ప్రాచీన పద్ధతులు పాటించి, 3,600 రకాల విత్తనాలు సేకరించి భద్రపరచాను.
భవిష్యత్తు లక్ష్యాలు
నా లక్ష్యం భవిష్యత్తు తరాల కోసం విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం, దేశీయ విత్తనాల సాగును ప్రోత్సహించడం.
