కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని, వారికి గౌరవం లేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. శనివారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలలో మహిళలను మోసం చేసే కొత్త స్కాములను మాత్రమే ప్రవేశపెట్టిందని ఆయన ఆరోపించారు.

One thought on “మహిళలకు రక్షణ కరువైంది – కూటమి ప్రభుత్వంపై ఆర్కే రోజా విమర్శలు”
Comments are closed.