పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్: అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్

పవన్: పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్

కాకినాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం పిఠాపురం పర్యటనకు రానున్నారు. నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి రోడ్డు మార్గాన రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు.రహదారి గుంతలను పరిశీలిస్తారు. ఇటీవల ఈ రహదారిలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో పవన్ ఈ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

11.45 గంటలకు పిఠాపురం మండలం కుమారపురంకు చేరుకుని, ఉపాధి హామీ నిధులతో నిర్మించిన 12,500 మినీ గోకులాలకు ప్రారంభోత్సవం చేస్తారు. 12.25 గంటలకు పిఠాపురం పాతబస్టాండ్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.00 గంటల నుంచి 2.00 గంటల వరకు పిఠాపురం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం 3.30 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి, అక్కడినుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళతారు.

ఈ వార్త కూడా చదవండి:
చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌ మోహన్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పిఠాపురం మండలం మల్లాంలోని గోకులం, విరవాడ, చేబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణలను, పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానాన్ని కలెక్టరు పరిశీలించారు.

ప్రారంభోత్సవాల అనంతరం పవన్ కల్యాణ్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించే అవకాశం ఉంది.