“పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త విధానం”

ఈనాడు, అమరావతి: పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. మంత్రివర్గం ఆమోదించిన ఈ విధానంపై ప్రభుత్వం మంగళవారం జీఓ (ఆధికారిక ఉత్తర్వు) విడుదల చేసింది. ఈ విధానం ద్వారా పారిశ్రామిక హోదా కల్పించడం, అలాగే ఎంఎస్ఎంఈలకు అందించే రాయితీలను పర్యాటక రంగంలో కూడా వర్తింపజేయడం జరగింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో రాష్ట్రంలోని తీర ప్రాంతాలు, ఇతర ఆధ్యాత్మిక, సందర్శనీయ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇతర రాయితీలు: • స్టాంపు డ్యూటీ, భూముల బదిలీపై చెల్లించాల్సిన సుంకం పూర్తిగా మినహాయింపు
• భూములు/భవనాలు/షెడ్లు లీజు కోసం చేసే రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ మినహాయింపు.
• తనఖా, తాకట్టుపై చేసే ఖర్చు తిరిగి చెల్లింపు.
• భూముల బదలాయింపునకు రెవెన్యూ, పట్టణ స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రుసుములు పూర్తిగా మినహాయింపు.
• పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక విద్యుత్తు టారిఫ్ వర్తింపు.
• ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు విద్యుత్తు సుంకం మినహాయింపు.
• క్వాలిటీ సర్టిఫికేషన్పై జాతీయస్థాయి సర్టిఫికేషన్పై రూ.2 లక్షలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్పై రూ.10 లక్షల వరకు రాయితీ వర్తింపు. రూ.51 కోట్లు, ఆపైన పెట్టుబడులకు రాయితీ వర్తించదు.
• ఏడేళ్లపాటు జీఎస్టి పూర్తిగా మినహాయింపు (గరిష్టంగా మూలధన పెట్టుబడి కింద చేసే ఖర్చుకు సమానంగా మినహాయింపు).
• భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల ఆధారంగా 7 నుంచి 15 ఏళ్లపాటు జీఎస్ఈ మినహాయింపు ఇచ్చే అంశంపై ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. (గరిష్టంగా మూలధన పెట్టుబడి కింద చేసే ఖర్చుకు సమానంగా మినహాయింపు).
• కోటి పెట్టుబడికి ఒక వ్యక్తికి ఉపాధి కల్పించే నిష్పత్తి ఆధారంగా అదనపు ప్రోత్సాహకం. ఏ కేటగిరీకి ఎంత ప్రోత్సాహకం ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

పర్యాటక రంగంలో ప్రభుత్వం అందించే రాయితీ (రూ.కోట్లలో):

కేటగిరీమూలధన పెట్టుబడిప్రభుత్వం ఇచ్చే రాయితీ
సూక్ష్మకోటి వరకు0.25
చిన్న10 కోట్ల వరకు1.50
మధ్యతరహా10-50 కోట్లు7.50
భారీ50-25010.00
మెగా250-50025.00
అల్ట్రా మెగా500 కోట్లు, ఆపైన40.00

• భారీ పరిశ్రమల్లో పెట్టుబడి మొత్తం రెండేళ్లలో, మెగా మూడేళ్లు, అల్ట్రా మెగా పరిశ్రమల్లో నాలుగేళ్లలో పెట్టాలి.
• మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు అదనంగా రాయితీ 5% వరకు (రూ.10 లక్షల వరకు) ఇవ్వనున్నారు.