బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకే రోజు నలుగురు రైతులను పోటన పెట్టిన ప్రభుత్వమే దీనని.. ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమని కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వమకాదని, గొప్ప ప్రాణాలు తీసే క్రూరత్వంతో నిండి ఉన్న ఇందిరమ్మ రాజ్యమని విమర్శించారు.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ, “కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్.. ఆత్మహత్యలు కాదివి, ముమ్మాటికీ మీరు చేసిన హత్యలు.. రుణమాఫీ చేయకుండానే తీసిన ప్రాణాలు.. రైతుబంధు వేయకుండానే జరిగిన ఖూనీలు.. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే కపట సర్కార్‌ను కూల్చి వేస్తాయి” అని అన్నారు.
అంతే కాదు, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్ తరఫున ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్‌లు పాల్గొంటారని వివరించారు.
ఈ కమిటీ రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతు ఆత్మహత్యలకు గల కారణాలను అధ్యయనం చేస్తుందని చెప్పారు. వారు క్షేత్రస్థాయి దుర్భర పరిస్థితులను పరిశీలించి, నివేదికను ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రి, కేసీఆర్‌కు అందజేస్తారని తెలిపారు.
కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిర్లక్ష్యంపై కూడా విమర్శలు చేసారు. “కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 400 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు” అని అన్నారు.
ఈ వార్త కూడా చదవండి
Subscribe to our YouTube channel

One thought on “కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల విషయంలో ఆగ్రహం”
Comments are closed.