ఏపీ మంత్రివర్గ సమావేశం: కీలక పాలసీలకు ఆమోదం, ప్రధాని ఆవాస్ యోజనపై నిర్ణయం

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో వివిధ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐటీ, టెక్స్టైల్ పాలసీలకు ఆమోదం లభించనుంది. మారీటైమ్, పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీల సవరణలు ఆమోదించేందుకు అవకాశం ఉంది. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పెండింగ్‌లో ఉన్న గృహాల నిర్మాణం పూర్తిచేయ పై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం పై కీలక చర్చ జరగనుంది.