ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో యువతకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం

ఎంపీ కేశినేని: స్వయం ఉపాధిపై యువతకు శిక్షణ

ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 9:
విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని యువతకు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ (ఎన్‌ఐఆర్‌డీ) సహకారంతో ఈ శిక్షణ చేపట్టారు.

తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రారంభం:
మొదటి విడతగా తిరువూరు నియోజకవర్గం నుంచి 50 మంది యువతీ, యువకులను ఎంపిక చేసి, నేటి ఉదయం బస్సు ద్వారా హైద‌రాబాద్‌కు పంపించారు. ఈ బృందం ఎన్‌ఐఆర్‌డీలో స్వయం ఉపాధి అవకాశాలపై శిక్షణ పొందనుంది.

ఎంపీ చిన్ని ప్రకటన:
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, “ప్రతీ కుటుంబంలో ఒక వ్యక్తిని స్వయం ఉపాధి రంగంలోకి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం,” అని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి యువతకు శిక్షణ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రతీ నెలలో ఒక్కో నియోజకవర్గం నుంచి యువతను ఎంపిక చేసి, ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి పంపించనున్నట్లు వెల్లడించారు.

అవినాష్ పీఏకు నోటీసులు:
కడప: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సోష‌ల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో కడప పోలీసులు నోటీసులు అందజేశారు. పులివెందులలో పోలీసులు వీటిని సర్వ్ చేశారు. ఈనెల 12 వరకు హైకోర్టు స్టే తెచ్చుకున్న రాఘవరెడ్డి, పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.