నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ

మంత్రి నారాయణ: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తాం

నెల్లూరు: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.

ఈ రోజు (శనివారం) మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఉదయం 5.30 గంటల నుంచి క్షేత్రస్థాయి పర్యటన చేసి నగరంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. 52వ డివిజన్ రంగనాయకుల పేటలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపురం వీధిలో పారిశుధ్య సమస్య ఉందని స్థానికులు తెలియజేయడంతో అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు.

నెల్లూరు కార్పొరేషన్‌లో శానిటేషన్ పై స్థానికుల అభిప్రాయాలను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నగరాన్ని పూర్తిగా క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు.