అల్లు అర్జున్‌ విచారణ: బన్నీని అడిగే కీలక ప్రశ్నలు

అallu Arjun విచారణ: బన్నీని అడిగే ప్రశ్నలు ఇవే..

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కి (Chikkadapally police station) చేరుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌, సీఐ రాజు బన్నీని ప్రశ్నించనున్నారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో విచారణ జరగనుంది. విచారణ కోసం బన్నీ స్టేషన్‌లోకి వెళ్లిన తర్వాత, తొలుత “ఎలా ఉన్నావ్ పుష్ప?” అని పలకరించి, తదుపరి విచారణ మొదలుపెట్టారని సమాచారం.

బన్నీని అడిగే ప్రశ్నలు ఇవే:

  1. సినిమాను చూసేందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు?
  2. మీరు రోడ్ షో చేశారు కదా? అనుమతి తీసుకున్నారా?
  3. మీరు రోడ్ షో చేయలేదంటున్నారు.. కానీ మీరు చేసింది రోడ్ షోనే కదా?
  4. అభిమానులు మరియు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?
  5. రేవతి చనిపోయిన విషయాన్ని థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా?
  6. రేవతి చనిపోయిన విషయం ఏసీపీ మీకు చెప్పారు కదా?
  7. మీకు ఎవరూ చెప్పలేదని మీరు మీడియా సమావేశంలో ఎందుకు చెప్పారు?

ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌ షో చూసేందుకు అల్లు అర్జున్‌ వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి, ఒకరి మృతికి కారణమైనందున చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో, పోలీసులు నేడు ఆయనను విచారిస్తున్నారు.