ప్రతిరోజు అలవాటుగా సోమవారం పత్రిక చేతిలోకి తీసుకోగానే పతాకవార్తగా తుపాకుల గుంపు కంటపడింది. ఏటూరునాగారం అడవుల్లో జరిగిన ఏడుగురికాల్చివేత దుర్ఘటనను చదవాల్సి రావడం చాలా బాధాకరం. పదేళ్ల కిందట ప్రతి ఉదయం మోసుకొచ్చే నెత్తుటి సమాచారమే మళ్లీ తిరిగి వచ్చింది.
ప్రతిరోజూ అలవాటుగా సోమవారం పత్రిక చేతిలోకి తీసుకోగానే పతాకవార్తగా తుపాకుల గుంపు కంటపడింది. ఏటూరునాగారం అడవుల్లో జరిగిన ఏడుగురికాల్చివేత దుర్ఘటనను చదవాల్సి రావడం చాలా బాధాకరం. పదేళ్ల కిందట ప్రతి ఉదయం మోసుకొచ్చే నెత్తుటి సమాచారమే మళ్లీ తిరిగి వచ్చింది. వినకూడని, కనకూడని, కలలో కూడా రాకూడదనుకున్న రాజ్యపు రక్త చరిత్రను, మళ్లీ తెలంగాణ చదవాల్సిన దుస్థితి దాపురించింది. పాత దుర్దినాలను మర్చిపోయి, పదేళ్ల పాటు ప్రగతి వార్తలకు అలవాటు పడిన సమాజం, ఏడాదిగా ప్రభుత్వం నోటి నుంచి జాలువారుతున్న అబద్ధాన్ని, విసురుతున్న చేతి వాటాన్ని, మోపుతున్న నిర్బంధాన్నిచవిచూస్తున్నది. ఏడాదిలోనే అంతటా అలజడి, అన్ని వర్గాల్లోనూ ఆందోళన అలుముకుంది.
రాష్ట్రాన్ని వెనక్కి నడిపిస్తూ, ప్రజలను నిర్బంధంలోకి నెడుతూ రేవంత్రెడ్డి సర్కార్ సాగిస్తున్న అమానవీయ పరిపాలనపై అందరిలో ఆవేదన నిండిపోయింది. రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు ఉన్న భయానక పరిస్థితి, ఇప్పుడు అదే విధంగా గడ్డుకాలం, అలజడి, ఆందోళన, అణచివేతలు ప్రతి చోట పెరిగిపోతున్నాయి. పల్లెల్లో ఇనుప బూట్ల కవాతు, లాఠీల కోలాటం, సంకెళ్ల సవ్వడి, తుపాకుల గర్జన మళ్లీ సాధారణమైంది. అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్ల వార్తలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకొని దుఃఖిస్తోంది. తెలంగాణకు మళ్లీ ఏ దుస్థితి రాకూడదనుకున్నామో, అదే విషమ పరిస్థితి రాష్ట్రమంతటా విస్తారమైపోయింది.
శనివారం నాడు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీలపై ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సర్కార్ సాగిస్తున్న దారుణ దమనకాండకు వ్యతిరేకంగా, దేశ రాజధానిలో నిర్వహిస్తున్న సభకు విపక్ష పార్టీల మద్దతు కోరుతూ, తెలంగాణ భవన్కు వారొచ్చారు. ఆ సందర్భంగా కేంద్ర సర్కారే కాదు, రేవంత్రెడ్డి సర్కార్ కూడా హక్కుల హననంలో ఏడాదిలోనే ఎలా కర్కోటకంగా వ్యవహరిస్తున్నదో వారితో చర్చకు వచ్చింది. ఎన్నికలకు ముందు ఏడో గ్యారెంటీ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన స్వేచ్ఛను, నేడు ఎలా చెరసాలల్లో ఖైదు చేస్తున్నారనే అంశంపై లోతైన చర్చే నడిచింది. ఇప్పుడు రాష్ట్రమే ఆంక్షల వలయంలో, నిర్బంధం నీడలో విలవిలలాడుతున్నది. ఈ వికారమైన మార్పును నిలువరించకపోతే, తెలంగాణ స్వాభావిక ఔన్నత్యం మసకబారిపోతుందని అందరం చర్చించుకున్నాం.
పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ ప్రగతి పోరులో, ఒకటో రెండో పొరపాట్లు ఉండవచ్చు. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ ప్రయోగిస్తున్న దమనకాండ రాష్ట్రానికి ప్రమాదకరంగా మారిపోయింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో థర్టీ యాక్ట్ అమలులో లేదు. కానీ, రేవంత్ సర్కార్ తెలంగాణ జిల్లాల్లో నెలల పాటు థర్టీ యాక్ట్ అమలుపరుస్తూ, సభలు, సమావేశాలు, నిరసనలపై ఉక్కుపాదం మోపింది. ఏడాదిలోనే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఇలా తెలంగాణ అడవి బూటకపు ఎన్కౌంటర్లకు కేంద్రంగా మార్చివేయబడింది.
అదే విధంగా, గురుకులాల విద్యార్థులు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు తన స్వస్థితిని నిలబెట్టుకునేందుకు ఇంకా ఎంతో పోరాడుతున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంతో సహాయం చేయడానికి సిద్ధంగా లేదు.
“ఇప్పటికే పావులెక్కి, గతంలో ఉన్న మంచి మార్గాలు అధిగమించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నిజమైన అభ్యుదయం తెలంగాణ ప్రజలకు దూరమవడం, మళ్లీ ముందుకు పోవడం ఎంత కష్టమైందో, రేవంత్ సర్కార్ తన పరిపాలనలో చెప్పుకోదగ్గ మార్పులను ఆవిష్కరించలేదు.”
