కేతిక శర్మ, రెబా జాన్ ఐటమ్ సాంగ్స్‌లో మెరిసిన కథానాయికలు!

కేతిక శర్మ, రెబా జాన్ ఐటమ్ సాంగ్స్‌లో మెరిసిన కథానాయికలు

హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. స్టార్ హీరోయిన్లు అయిన కాజల్, తమన్నా, శ్రుతీ హాసన్, సమంత ఇప్పటికే ఐటమ్ సాంగ్స్‌లో మెరిసి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఇప్పుడు ఈ జాబితాలో కొత్తగా మరో ఇద్దరు హీరోయిన్‌లు చేరారు. టాలీవుడ్‌లో హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మ, రెబా జాన్ ఇప్పుడు తొలిసారి స్పెషల్ సాంగ్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి ఐటమ్ సాంగ్స్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెబా జాన్ – ‘మ్యాడ్ స్క్వేర్’లో స్పెషల్ సాంగ్!

కన్నడ చిత్రాలతో సినీ ప్రయాణం ప్రారంభించిన రెబా జాన్, తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే, ఆమెను తెలుగులో అసలైన గుర్తింపు తీసుకురావడంలో సామజవర గమన’ చిత్రం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రెబా, మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడామె మరోసారి టాలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు ఐటమ్ సాంగ్‌తో రాబోతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో రెబా జాన్ స్పెషల్ సాంగ్ చేసింది. ‘స్వాతి రెడ్డి…’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఈ పాట 13 మిలియన్ వ్యూస్ దక్కించుకుని, విపరీతంగా వైరల్ అవుతోంది. పాటలో రెబా జాన్ గ్లామర్, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ పాట సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చేలా ఉంది.

కేతిక శర్మ – ‘రాబిన్ హుడ్’లో అదిరే డాన్స్!

‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ, మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. నాగశౌర్య ‘లక్ష్య’, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’, సాయిధరమ్ తేజ్ ‘బ్రో’ చిత్రాలతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న కేతిక, ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ చేయలేదు. అయితే, తాజాగా ఓ బంపర్ ఆఫర్‌ను అందిపుచ్చుకుని, తొలిసారి ఐటమ్ సాంగ్‌లో కనిపించబోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. ఇందులో కేతిక శర్మ ‘అదిదా సర్‌ప్రైజూ…’ అనే పాటలో స్పెషల్ డాన్స్ చేసింది. ఈ పాటను మార్చి 10న విడుదల చేయబోతున్నారు. ఈ పాట కూడా హిట్ అయితే, కేతిక శర్మ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

రెండు పాటలు.. ఒకేరోజు రిలీజ్!

ఇద్దరు యంగ్ హీరోయిన్లు తొలిసారి స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఈ చిత్రాలు మార్చి 28న విడుదల కానున్నాయి. రెబా జాన్ ‘మ్యాడ్ స్క్వేర్’, కేతిక శర్మ ‘రాబిన్ హుడ్’ రెండూ ఒకే రోజున రిలీజ్ కావడంతో, వీరి పాటల మధ్య ఓ రేంజ్ పోటీ నెలకొంది.

అయితే, ప్రేక్షకులు ఎవరి ఐటమ్ సాంగ్‌కి ఎక్కువ ఫిదా అవుతారో చూడాలి!

Read More

One thought on “కేతిక శర్మ, రెబా జాన్ ఐటమ్ సాంగ్స్‌లో మెరిసిన కథానాయికలు!

Comments are closed.