మాస్ చిత్రాలతో దూసుకెళ్లిన రవితేజ, ఈసారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమలతో రవితేజ ఓ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రెండ్‌లో రవితేజ
సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ కావడంతో, దర్శకులు ఫ్యామిలీ కథల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రెండ్‌లో రవితేజ ఓ సరికొత్త కథతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్‌ను బీవీఎస్ రవి రెడీ చేయగా, దర్శకత్వ బాధ్యతలు కిషోర్ తిరుమల చూసుకోనున్నారు.
‘అనార్కలి’ టైటిల్ ఫిక్స్?
ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్ ఖరారవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి నిర్మించనున్నారని టాక్.
హీరోయిన్లు, సంగీతం.. సంక్రాంతి రిలీజ్ ప్లాన్?
ఇప్పటికే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల పేర్లు బయటకొస్తున్నాయి. ‘ప్రేమలు’ ఫేమ్ మామితా బైజు, ‘డ్రాగన్’ నాయిక కయాదు లోహర్ రవితేజకు జోడీగా కనిపించనున్నట్లు సమాచారం. సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి!

One thought on “మాస్ మహారాజా రవితేజ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో.. ‘అనార్కలి’ టాక్!”
Comments are closed.